శ్రీవారి సేవా ట్రైనర్స్, గ్రూప్ సూపర్ వైజర్లకు నూతన సాఫ్ట్వేర్
- September 04, 2025
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్ధం విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శ్రీవారి సేవకులకు గ్రూప్ సూపర్ వైజర్లు, ట్రైనర్స్‌తో నిరంతర శిక్షణ ఇవ్వనున్నట్లు, ఇందుకోసం నూతన సాఫ్ట్వేర్ రూపొందించినట్లు టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు చెప్పారు.
అదేవిధంగా తిరుమలలో పారదర్శకంగా బిగ్, జనతా క్యాంటీన్లు కేటాయించినట్లు ఛైర్మన్ తెలిపారు.తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం ఛైర్మన్, ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సివిఎస్వో మురళికృష్ణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్ర బాబు నాయుడు సూచనల మేరకు టీటీడీలోని శ్రీవారి సేవలో పలు సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు.
- శ్రీవారి భక్తులకు స్వచ్ఛంధంగా సేవలు అందించేందుకు శ్రీవారి సేవను 2000 సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా తిరుమలలో ప్రారంభించారన్నారు.
- శ్రీవారి సేవ ప్రారంభించి ఇప్పటికే 25 సంవత్సరాలు పూర్తి కావస్తోందని, ఈ 25 సంవత్సరాలలో తిరుమల, తిరుపతిలలో దాదాపు 17 లక్షల మంది శ్రీవారి సేవకులు స్వచ్ఛంధంగా శ్రీవారి సేవలో పాల్గొన్నట్లు చెప్పారు.
- శ్రీవారి సేవకులకు శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం, వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు.
- రోజుకు దాదాపు 3,500 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని అన్ని విభాగాలలో తమ సేవలను అందిస్తున్నట్లు చెప్పారు.
అనంతరం ఈవో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, భక్తులకు మేరుగైన సౌకర్యాలు కల్పించడం, తిరుమల పవిత్ర కాపాడటంలో భాగంగా గత 14 నెలలుగా టీటీడీలో అనేక సంస్కరణలు చేపట్టిందని ఈవో జె.శ్యామలరావు అన్నారు. ఇందులో భాగంగా క్యూ లైన్లు, పారిశుద్ధ్యం, కల్యాణకట్ట, లగేజి కౌంటర్లు, అన్నప్రసాదాలు, శ్రీవారి సేవకులతో నిరంతరాయంగా అన్నప్రసాదాల పంపిణీ చేస్తున్నామన్నారు. లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యత, రుచిపై భక్తుల నుండి ప్రశంసలు అందుతున్నదన్నారు.
- శ్రీవారి సేవకుల ట్రైనర్స్‌కు ఐఐఎం అహ్మదాబాద్, Director, Planning, Govt. of A.P వారి ఆధ్వర్యంలో సేవకులకు సంయుక్తంగా శిక్షణ ఇచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టిందన్నారు.
- ఈ శిక్షణలో ప్రధానంగా శ్రీవారి వైభవం, తిరుమల ప్రాముఖ్యత, భక్తులకు టిటిడి అందిస్తున్న సేవలు, సేవాతత్వం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
గ్రూప్ సూపర్ వైజర్స్
- ఈ విభాగంలో 45 - 65 సంవత్సరాల వయసు ఉన్న శ్రీవారి సేవలు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. తిరుమలలోని వివిధ విభాగాలలో సేవకులు అందించే సేవలను వీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి గ్రేడింగ్ రూపంలో అధికారులకు నివేదిస్తారు. తద్వారా సేవకులు మరింత క్రమశిక్షణ, నిబద్ధతతో సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది.
- వీరి సేవా కాల పరిమితి 15 రోజులు, 30 రోజులు, 90 రోజులు, విద్యార్హత: కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
ప్రొఫెషనల్ సేవ
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టిటిడిలోని స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద, చిన్న పిల్లల ఆసుపత్రి, అశ్వినీ ఆసుపత్రులలో శ్రీవారి సేవ ద్వారా రోగులకు ఉచితంగా సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
ఎన్.ఆర్.ఐ సేవ
- విదేశాలలో ఉన్న ఎందరో ఎన్.ఆర్.ఐ నిపుణులు శ్రీవారి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. వివిధ వృత్తులలో ప్రావీణ్యం కల్గిన నిపుణులకు శ్రీవారి సేవకు అవకాశం కల్పిస్తున్నాం.
పారదర్శకంగా బిగ్ మరియు జనతా క్యాంటీన్లు కేటాయింపు
- అదనపు ఈవో తిరుమలలో పారదర్శకంగా బిగ్ మరియు జనతా క్యాంటీన్లు కేటాయించినట్లు, ఇందుకోసం నూతన పాలసీ తయారు చేసి, నిపుణుల కమిటీతో ఆయా సంస్థల కార్యకలాపాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అర్హత కలిగిన సంస్థలకు మాత్రమే క్యాంటీన్లు కేటాయించినట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
- తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆహార అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం పది (10) బిగ్ క్యాంటీన్లు మరియు ఆరు (6) జనతా క్యాంటీన్లు ఉన్నాయన్నారు.
- భక్తులకు మరింత రుచికరమైన, నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని టీటీడీ దేశంలోని ప్రముఖ ఆహార పదార్థల తయారీ సంస్థలకు EOI ద్వారా పారదర్శకంగా కేటాయించిందన్నారు.
- టీటీడీ నూతన విధానాన్ని రూపొందించిందని, అందుకు అనుగుణంగా నిపుణుల కమిటీ ఆహార పదార్థాల నిణ్యాత ప్రమాణాలలు, ఇతర అంశాలను పరిశీలించిందని చెప్పారు.
- ఇందులో భాగంగా సదరు సంస్థలు లాభాపేక్ష లేకుండా భక్తులకు సేవలందించేందుకు ముందుకు వచ్చాయన్నారు.
- ప్రస్తుతం 5 బిగ్ & 5 జనతా క్యాంటీన్లకు 2025 జూన్ 14వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి, సీల్డ్ EOI దరఖాస్తులను టీటీడీ ఆహ్వానించిందని, ఇందులో టీటీడీ నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులను పరిశీలించి క్రింది సంస్థలకు కేటాయించినట్లు వివరించారు.
బిగ్ క్యాంటీన్లు:
1 శ్రీవత్స బిగ్ క్యాంటీన్-అడయార్ ఆనంద భవన్ స్వీట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై
2 కౌస్తుబం బిగ్ క్యాంటీన్-ధంతూరి గ్రూప్ ఆఫ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్
3 సందీప బిగ్ క్యాంటీన్-ప్రిజం హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్
4 సప్తగిరి బిగ్ క్యాంటీన్-సంకల్ప్ రిక్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, అహ్మదాబాద్
5 శ్రీ వెంకటేశ్వర బిగ్ క్యాంటీన్-శ్రీ సుఖ్‌సాగర్ హాస్పిటాలిటీ సర్వీసెస్, నవీ ముంబై
జనతా క్యాంటీన్లు
1 PAC (WEST) జనతా క్యాంటీన్-త్రివర్గ ఫుడ్ అండ్ బేవరేజెస్, విజయవాడ
2 PAC (NORTH) - జనతా క్యాంటీన్-శ్రీ రాఘవేంద్ర వెజ్ రెస్టారెంట్, హైదరాబాద్
3 SMC జనతా క్యాంటీన్-సంతోష్ ధాబా ఎక్స్‌క్లూజివ్ A/C (సంతోష్ కాజిల్), హైదరాబాద్
4 HVC జనతా క్యాంటీన్-శ్రీదేవి హాస్పిటాలిటీ సర్వీసెస్, నవీ ముంబై
5 MMT జనతా క్యాంటీన్-పృథ్వీ హాస్పిటాలిటీ సర్వీసెస్, పూణే.
ఈ కార్యక్రమంలో వీజీవోలు శ్రీ రామ్ కుమార్, సురేంద్ర, డిప్యూటీ జి ఎం ఐటీ శ్రీ వెంకటేశ్వర్లు నాయుడు, ఇతర టీటీడీ ఐటీ విభాగం మరియు జియో ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన ఒమన్..!!
- కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు
- NDWBFలో ఖతార్.. భారత్ తో బలమైన సంబంధాలు..!!
- ఇరాన్ పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!
- థర్డ్ పార్టీలతో ఓవర్‌నైట్ క్యాష్ స్టోరేజ్ ఆపాలన్న సెంట్రల్ బ్యాంక్..!!







