ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే బహిష్కరణ వేటే..!!
- September 04, 2025
రియాద్: ప్రజా భద్రతకు హాని కలిగించే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తుది కోర్టు తీర్పు జారీ చేస్తే సౌదీయేతరులను బహిష్కరించాలని నిర్దేశించే ట్రాఫిక్ చట్టానికి కొత్త సవరణలను ఆమోదించారు. ఇలా బహిష్కరించబడినవారు రాజ్యంలోకి తిరిగి ప్రవేశించకుండా నిషేధించబడతారని ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ కొత్త విధానాన్ని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమన్వయంతో అమలు చేయబడుతుందన్నారు. తాజా సవరణలలో ప్రజా భద్రతకు హాని కలిగించే ఉల్లంఘనలకు కఠినమైన జరిమానాలు కూడా ఉన్నాయని తెలిపారు.
ఒక వ్యక్తి మొదటి ఉల్లంఘన చేసిన ఒక సంవత్సరం లోపు రెండవసారి ఉల్లంఘనకు పాల్పడితే గరిష్ఠస్థాయిలో జరిమానా విధించబడుతుందని వెల్లడించారు. అదే మూడవసారి ఉల్లంఘన పునరావృతమైతే, రెండవ ఉల్లంఘనకు విధించిన జరిమానాను రెట్టింపు చేస్తారని, అలాతే సదరు వ్యక్తికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







