HMC లో జెనటిక్ మ్యూటేషన్ టెస్టులు..!!
- September 05, 2025
దోహా: ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఖతార్ మరింత బలోపేతం అయింది. హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC)లోని లాబొరేటరీ మెడిసిన్ మరియు పాథాలజీ విభాగం (DLMP) అధికారికంగా హోల్ ఎక్సోమ్ సీక్వెన్సింగ్ (WES) పరీక్షను ప్రారంభించింది. ఈ సంచలనాత్మక పరీక్షలు జన్యు విశ్లేషణలో ఒక ప్రధాన ముందడుగుగా భావిస్తున్నారు. ఖతార్లోని రోగుల జన్యు ప్రొఫైల్కు అనుగుణంగా వేగవంతమైన, మరింత ఖచ్చితమైన రోగ నిర్ధారణలు చేయడంతోపాటు అత్యంత మెరుగైన చికిత్సలను అందించేందుకు వీలు కల్పిస్తుంది.
ఈ కొత్త పరీక్షా టెక్నాలజీ పెద్దలు మరియు పిల్లలు, జన్యుపరమైన జబ్బులతో బాధపడుతున్న రోగులకు, అలాగే కొన్ని రకాల క్యాన్సర్ ఉన్నవారికి ప్రయోజనం చేకూరుస్తుందని మెడికల్ కార్పొరేషన్ వెల్లడించింది. గతంలో, ఈ పరీక్షల కోసం రోగుల రక్త నమూనాలను విదేశాలకు పంపాల్సి వచ్చేదని, దాంతో ఈ ప్రక్రియకు ఫలితాలు రావడానికి చాలా సమయం పట్టేదని, ఇప్పుడా పరిస్థితి తప్పిందని, వేగంగా టెస్ట్ ఫలితాలను పొందవచ్చని DLMP చైర్ డాక్టర్ ఐనాస్ అబ్దులాజీజ్ అల్-కువారీ తెలిపారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







