దేశాభివృద్ధికి బూస్టర్ డోస్, ప్రజలకు దీపావళి గిఫ్ట్..!
- September 04, 2025
న్యూ ఢిల్లీ: జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ గా అభివర్ణించారు. దీపావళికి ముందే ప్రజలకు ఆనందం వచ్చిందన్నారాయన. ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే మా ప్రభుత్వ విధానం అని ఆయన స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణలతో పౌరుల జీవన నాణ్యత మెరుగుపడుతుందన్నారు. వినియోగం, వృద్ధికి కొత్త బూస్టర్ డోస్ లభిస్తుందని ఆకాంక్షించారు. కొత్త సంస్కరణలతో ఆత్మనిర్భర్ భారత్ మరింత ముందే సాకారం అవుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
‘మేడిన్ ఇండియాపై అందరూ ఆలోచించాలి. గాంధీజీ ఇచ్చిన స్వదేశీ నినాదం అందరం పాటిద్దాం. స్వదేశీ విధానంతోనే మరింత స్వావలంబన సాధించగలం. హెయిర్ పిన్నులు కూడా విదేశాల నుంచి తెచ్చుకునే విధానం మారాలి. స్వదేశీ వస్తు వినియోగం, మేడిన్ ఇండియాను విద్యార్థి దశ నుంచే అలవాటు చేయాలి. మన దేశంలో తయారు చేసిన వస్తువులనే వాడాలి.
దేశీయ ఉత్పత్తులు వాడేందుకు గర్వపడాలి. మేడిన్ ఇండియాపై చిన్న, పెద్ద అందరూ ఆలోచించాలి. దేశీయ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారిపోతాయి. స్వదేశీ డే స్వదేశీ వీక్ ను పండుగగా నిర్వహించుకోవాలి.దేశీయ ఉత్పత్తిదారులను మనమే గౌరవించాలి, ఆదరించాలి. దేశభక్తి, ఆత్మగౌరవం, స్వయం సమృద్ధితో దేశాన్ని ముందుకు నడిపిద్దాం” అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







