సౌదీ అరేబియాలో వారంలో 20,882 మంది అరెస్టు..
- September 07, 2025
రియాద్ : గత వారం రోజుల్లో సౌదీ భద్రతా అధికారులు మొత్తం 20,882 మంది అక్రమ నివాసితులను అరెస్టు చేశారు. ఆగస్టు 28 - సెప్టెంబర్ 3 మధ్య కాలంలో సంబంధిత ప్రభుత్వ సంస్థల సహకారంతో భద్రతా దళాలు సంయుక్త తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా అరెస్టులు చేసినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అరెస్టు చేయబడిన వారిలో 12,975 మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించినవారు, 4,185 మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించినవారు, 3,722 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినవారు ఉన్నారు. ప్రయాణ పత్రాలను పొందడానికి మొత్తం 22,550 మంది వారి దౌత్య కార్యకలాపాలకు పంపినట్లు పేర్కొంది.
సౌదీలోకి అక్కమంగా వస్తూ పట్టుబడ్డ 1,244 మందిలో 33 శాతం యెమెన్ జాతీయులు, 66 శాతం ఇథియోపియన్ జాతీయులు , ఒక శాతం ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు. అలాగే, ఉల్లంఘించినవారికి రవాణా, ఆశ్రయం మరియు ఉపాధి కల్పించాడానికి ప్రయత్నించిన 20 మందిని కూడా అరెస్టు చేశారు. అక్రమ నివాసితులకు సహాయం చేస్తే ఏ వ్యక్తికైనా 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR1 మిలియన్ వరకు జరిమానా విధిస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 నంబర్‌కు మరియు రాజ్యంలోని మిగిలిన ప్రాంతాలలో 999 లేదా 996 నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా ఉల్లంఘన కేసులను నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







