ఖతార్‌కు తొలి 10 నెలల్లో పోటెత్తిన పర్యాటకులు..!!

- November 04, 2026 , by Maagulf
ఖతార్‌కు తొలి 10 నెలల్లో పోటెత్తిన పర్యాటకులు..!!

దోహా: 2026 ఏడాది తొలి 10 నెలల్లో ఖతార్‌కు వివిధ దేశాల నుంచి 2.95 మిలియన్ల మంది పర్యాటకులు వచ్చినట్లు ఖతార్ టూరిజం వెల్లడించింది. భూమి, విమాన, సముద్ర మార్గాల ద్వారా వీరు ఖతార్‌కు చేరుకున్నట్లు తెలిపింది.

అక్టోబర్ నెలలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సెప్టెంబర్‌లో 276,000 మంది రాగా, అక్టోబర్‌లో 336,000 మంది సందర్శించారు. దీంతో సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో పర్యాటకుల సంఖ్య 21.7 శాతం పెరిగింది.

జనవరి నుంచి అక్టోబర్ వరకు వచ్చిన పర్యాటకుల్లో గల్ఫ్ దేశాల (జీసీసీ) వాటా అత్యధికంగా ఉంది. ఈ దేశాల నుంచి 1.176 మిలియన్ల మంది (39.9 శాతం) ఖతార్‌ను సందర్శించారు. ఆసియా, ఓషియానియా దేశాల నుంచి 630,000 లక్షల మంది (21.4 శాతం) రాగా, యూరప్ దేశాల నుంచి 620,000 మంది (21 శాతం) వచ్చారు.

ఇక అమెరికా ఖండాల నుంచి 216,000 మంది (7.3 శాతం), ఇతర అరబ్ దేశాల నుంచి 209,000 లక్షల మంది (7.1 శాతం) ఖతార్‌ను సందర్శించారు. ఇతర ఆఫ్రికా దేశాల నుంచి 96 వేల మంది (3.3 శాతం) పర్యాటకులు వచ్చినట్లు ఖతార్ టూరిజం గణాంకాలు వెల్లడించాయి. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న సందర్శకులే ఖతార్ పర్యాటక రంగానికి ప్రధాన బలంగా నిలుస్తుండగా, ఆసియా, యూరప్ దేశాల నుంచి కూడా గణనీయమైన సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com