ఒమన్‌లో ఎస్ఎంఈల అభివృద్ధికి మరో ముందడుగు..!!
- November 04, 2026
ఇబ్రా: ఒమన్‌లో చిన్న, మధ్యతరహా పరిశ్రమల (SMEs) అభివృద్ధికి కృషి చేస్తున్న రియాదా (Riyada) సంస్థ నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని ఇబ్రా విలాయత్‌లో నూతన భవనాన్ని ప్రారంభించింది. నార్త్ అల్ షర్కియా గవర్నర్ మహమూద్ యాహ్యా అల్ ధుహ్లీ ముఖ్య అతిథిగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
ప్రభుత్వ శాఖల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నార్త్ అల్ షర్కియా గవర్నర్ కార్యాలయం ఈ భవన నిర్మాణానికి సహకారం అందించింది. ఈ నూతన కేంద్రం ద్వారా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీలు, చేతివృత్తుల వారికి అందించే సేవల పరిధి విస్తరించనుంది. వ్యాపార సంస్థల అభివృద్ధి, స్థిరత్వం, పోటీతత్వాన్ని పెంపొందించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలతో కూడిన సమగ్ర వాతావరణాన్ని ఈ కేంద్రం అందించనుంది.
ఈ భవనంలో రియాదా బిజినెస్ సెంటర్‌తో పాటు చేతివృత్తుల పరిశ్రమల కోసం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఒమానీ హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాల కోసం ప్రత్యేకంగా 'ఒమానీ హ్యాండీక్రాఫ్ట్స్ హౌస్'ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా స్థానిక కళాకారులు, చేతివృత్తుల వారు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే అవకాశం కలగనుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌కు తొలి 10 నెలల్లో పోటెత్తిన పర్యాటకులు..!!
- ఒమన్‌లో ఎస్ఎంఈల అభివృద్ధికి మరో ముందడుగు..!!
- దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్‌లో దీపావళి వేడుకలు..
- దుబాయ్‌లో ప్రపంచంలోనే తొలి సిటీ వైడ్ టూరిజం లాయల్టీ ప్రోగ్రామ్ ప్రారంభం
- చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్..జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- భారత్‌లో 1500% పెరిగిన బంగారం అక్రమ రవాణా!
- అర్ధరాత్రి 2.30 వరకు షోలు..చిత్రసీమ కు CM విజయ్ గుడ్ న్యూస్
- మిడ్ టర్మ్ ఎన్నికలు.. అమెరికాలో మొదలైన పోలింగ్
- సైబర్ నేరాల కట్టడికి రాష్ట్రాల మధ్య సమన్వయం కీలకం: డీజీపీ సీవీ ఆనంద్
- విశాఖ మేయర్‌గా ముక్కా శ్రావణి ఎన్నిక!







