అజ్మాన్ లో పెట్రోల్ రవాణా వాహనాలపై ఆంక్షలు..!!
- September 08, 2025
యూఏఈ: అజ్మాన్లో పెట్రోలియం ఉత్పత్తులను రవాణా చేసే వాహనాలపై ఆంక్షలు విధించారు. అనుమతి లేని ప్రాంతాల్లో పార్కింగ్ చేయడాన్ని నిషేధించారు. ఈ ప్రమాదకరమైన పదార్థాల కారణంగా జరిగే ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
కొత్త నిబంధన ప్రకారం.. పెట్రోల్ రవాణా చేసే వాహనాలను ఇకపై జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో పార్కింగ్ చేయడాన్ని నిషేధించారు. నిబంధనలు పాటించని వాహనాలకు భారీగా జరిమానా విధిస్తామని అజ్మాన్ సుప్రీం ఎనర్జీ కమిటీ ఒక ప్రకటనలో హెచ్చరించింది.
మొదటి చేసిన నేరానికి 5,000 దిర్హామ్ల జరిమానా, అది పునరావృతం అయితే 10,000 దిర్హామ్ల జరిమానా, మూడోసారి నేరం పునరావృతమైతే20,000 దిర్హామ్ల జరిమానాతో పాటు, వాహనాన్ని సీజ్ చేస్తారు. అలాగే, ఆయా పెట్రోలియం సంస్థల ట్రేడింగ్ పర్మిట్లను నిలిపివేయడం లేదా రద్దు చేయడం వంటి కఠిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







