టిక్ టాక్ పై బ్యాన్ ఎత్తివేయం: కేంద్ర మంత్రి
- September 09, 2025
న్యూ ఢిల్లీ: టిక్ టాక్ యాప్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ యాప్‌ను తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని2 ఆయన తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వ వర్గాల్లో ఎలాంటి చర్చలు జరగలేదని కూడా ఆయన వెల్లడించారు. భారతదేశ భద్రతకు ముప్పు కలిగించే యాప్స్‌ను తిరిగి అనుమతించే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, టిక్ టాక్ యాప్ మళ్లీ భారతదేశంలోకి వస్తుందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై స్పందించిన మంత్రి వైష్ణవ్, టిక్ టాక్‌కు సంబంధించిన నిషేధం పూర్తిగా భద్రతకు సంబంధించినదని, దానిని ఎత్తివేయడానికి ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు లేవని చెప్పారు. ప్రజల డేటా భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు.
టిక్ టాక్ వంటి యాప్స్‌పై నిషేధం విధించడం వెనుక జాతీయ భద్రతే ప్రధాన కారణమని మంత్రి వైష్ణవ్ తెలిపారు. ఈ యాప్ ద్వారా భారతీయ పౌరుల వ్యక్తిగత డేటా దుర్వినియోగం అవుతుందని, దేశ భద్రతకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. అందుకే ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయం తీసుకుందని అన్నారు. తమ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, కేవలం దేశ భద్రత మాత్రమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!