ఆసియా కప్‌-2025: పూర్తి షెడ్యూల్‌, అన్ని జట్లు, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు

- September 09, 2025 , by Maagulf
ఆసియా కప్‌-2025: పూర్తి షెడ్యూల్‌, అన్ని జట్లు, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు

దుబాయ్: ఆసియా క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద టోర్నమెంట్లలో ఒకటైన ఆసియా కప్ ప్రారంభానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈసారి జరిగే ఆసియా కప్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఆసియా కప్ 2025 టీ20 ఫార్మాట్‌లో జరుగుతోంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమై, సెప్టెంబర్ 28న ఫైనల్‌తో ముగుస్తుంది. టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లు అబుదాబి, దుబాయ్‌లో జరుగుతాయి. ఒకే ఒక డబుల్ హెడర్ మ్యాచ్ ఉంది. అది మినహా, అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి. డబుల్ హెడర్ రోజున, సాయంత్రం మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, యూఏఈ, హాంకాంగ్, ఒమన్ జట్లు పాల్గొంటున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత సూపర్-4 రౌండ్, చివరికి సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఆసియా కప్ 2025 జట్ల వివరాలు

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకు సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

పాకిస్థాన్ జట్టు: సల్మాన్ అలీ ఆగా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మిర్జా, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముకీమ్.

అఫ్గానిస్థాన్ జట్టు: రషీద్ ఖాన్ (కెప్టెన్), రెహమానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, సెదికుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జానత్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, షరఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, అల్లాహ్ గజన్ఫర్, నూర్ అహ్మద్, ఫరీద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్‌హక్ ఫారూకీ.

శ్రీలంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), పతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కామిల్ మిషారా, దసున్ శనక, కమీందు మెండిస్, వనిందు హసరంగా, నువానిడు ఫెర్నాండో, దునిత్ వెలాలగే, చమికా కరుణరత్నే, మహీష్ తీక్షణ, మతీశ పతిరణ, నువాన్ తుషారా, దుష్మంత చమీరా, బినురా ఫెర్నాండో.

బంగ్లాదేశ్ జట్టు: లిటన్ దాస్ (కెప్టెన్), తంజిద్ హసన్, పర్వేజ్ హుస్సేన్ ఇమోన్, సైఫ్ హసన్, తౌహీద్ హృదోయ్, జేకర్ అలీ అనిక్, షమీమ్ హుస్సేన్, ఖాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మెహెదీ హసన్, రిషాద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, షోరఫుల్ ఇస్లాం, సైఫుద్దీన్.

యూఏఈ జట్టు: మహ్మద్ వసీం (కెప్టెన్), అలీషాన్ శరాఫూ, ఆర్యన్ష్ శర్మ, ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, ఎతాన్ డి’సౌజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్ధిక్, మతివుల్లా ఖాన్, మహ్మద్ ఫరూక్, మహ్మద్ జవాదుల్లా, మహ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా, రోహిద్ ఖాన్, సిమ్రన్‌జీత్ సింగ్, సగీర్ ఖాన్.

హాంకాంగ్ జట్టు: యాసిమ్ ముర్తజా (కెప్టెన్), బాబర్ హయత్, జిషాన్ అలీ, నియాజకత్ ఖాన్ మహ్మద్, నస్రుల్లా రాణా, మార్టిన్ కోయెట్జీ, అన్షుమాన్ రథ్, కల్హన్ మార్క్ చల్లు, ఆయుష్ ఆశీష్ శుక్లా, మహ్మద్ ఐజాజ్ ఖాన్, అతీక్ ఉల్ రెహ్మాన్ ఇక్బాల్, కించిత్ షా, ఆదిల్ మహ్మద్, హారూన్ మహ్మద్ అర్షద్, అలీ హసన్, షాహిద్ వాసిఫ్, గజన్ఫర్ మహ్మద్, మహ్మద్ వహీద్, అనాస్ ఖాన్, ఎహ్సాన్ ఖాన్.

ఒమన్ జట్టు: జతిందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మిర్జా, వినాయక్ శుక్లా, సుఫియాన్ యూసుఫ్, ఆశిష్ ఒడేదరా, ఆమిర్ కలీమ్, మహ్మద్ నదీమ్, సుఫియాన్ మహ్మద్, ఆర్యన్ బిస్ట్, కరణ్ సోనావాలే, జికిర్యా ఇస్లాం, హస్నైన్ షా, ఫైసల్ షా, మహ్మద్ ఇమ్రాన్, నదీమ్ ఖాన్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ.

ఆసియా కప్ 2025 మ్యాచ్ షెడ్యూల్

లీగ్ దశ మ్యాచ్‌లు:

సెప్టెంబర్ 9: అఫ్గానిస్థాన్ vs హాంకాంగ్ – రాత్రి 8 గంటలు – అబుదాబి

సెప్టెంబర్ 10: భారత్ vs యూఏఈ – రాత్రి 8 గంటలు – దుబాయ్

సెప్టెంబర్ 11: బంగ్లాదేశ్ vs హాంకాంగ్ – రాత్రి 8 గంటలు – అబుదాబి

సెప్టెంబర్ 12: పాకిస్థాన్ vs ఒమన్ – రాత్రి 8 గంటలు – దుబాయ్

సెప్టెంబర్ 13: బంగ్లాదేశ్ vs శ్రీలంక – రాత్రి 8 గంటలు – అబుదాబి

సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్థాన్ – రాత్రి 8 గంటలు – దుబాయ్

సెప్టెంబర్ 15: యూఏఈ vs ఒమన్ – సాయంత్రం 5:30 గంటలు – అబుదాబి

సెప్టెంబర్ 15: శ్రీలంక vs హాంకాంగ్ – రాత్రి 8 గంటలు – దుబాయ్

సెప్టెంబర్ 16: బంగ్లాదేశ్ vs అఫ్గానిస్థాన్ – రాత్రి 8 గంటలు – అబుదాబి

సెప్టెంబర్ 17: పాకిస్థాన్ vs యూఏఈ – రాత్రి 8 గంటలు – దుబాయ్

సెప్టెంబర్ 18: శ్రీలంక vs అఫ్గానిస్థాన్ – రాత్రి 8 గంటలు – అబుదాబి

సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్ – రాత్రి 8 గంటలు – అబుదాబి

సూపర్-4 రౌండ్ మ్యాచ్‌లు:

సెప్టెంబర్ 20: B1 vs B2 – రాత్రి 8 గంటలు – దుబాయ్

సెప్టెంబర్ 21: A1 vs A2 – రాత్రి 8 గంటలు – దుబాయ్

సెప్టెంబర్ 23: A2 vs B1 – రాత్రి 8 గంటలు – అబుదాబి

సెప్టెంబర్ 24: A1 vs B2 – రాత్రి 8 గంటలు – దుబాయ్

సెప్టెంబర్ 25: A2 vs B2 – రాత్రి 8 గంటలు – దుబాయ్

సెప్టెంబర్ 26: A1 vs B1 – రాత్రి 8 గంటలు – దుబాయ్

ఫైనల్ మ్యాచ్:

సెప్టెంబర్ 28 – రాత్రి 8 గంటలు – దుబాయ్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com