కువైట్‌లో జరిగిన GCC సైబర్ సెక్యూరిటీ సమావేశంలో పాల్గొన్న ఒమన్
- September 09, 2025
మస్కట్: కువైట్‌లో "GCC మినిస్టీరియల్ కమిటీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అథారిటీస్ అండ్ సెంటర్స్" సమావేశం జరిగింది. ఇందులో ఒమన్ సుల్తానేట్ రాయబారి డాక్టర్ సలేహ్ అమీర్ అల్ ఖరౌసి ఒమన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు.ఈ సమావేశంలో GCC సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ, కార్యనిర్వాహక ప్రణాళికలకు సంబంధించిన వివిధ విషయాలు చర్చించారు.
సైబర్ సెక్యూరిటీ రంగంలో GCC దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే మార్గాలు, డిజిటల్ రక్షణను పెంచడంపై చర్చించారు. అలాగే, పెరుగుతున్న సైబర్ బెదిరింపులను ఎదుర్కొవడానికి చేపట్టాల్సి కార్యాచరణను సమీక్షించారు. ఈ సమావేశం సందర్భంగా సైబర్ సెక్యూరిటీ రంగంలో GCC దేశాల మధ్య అంతర్జాతీయ సహకారం కోసం "సైబర్ థ్రెట్ ఇన్ఫర్మేషన్ షేరింగ్" ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చే ప్రణాళికను ఆమోదించారు.
తాజా వార్తలు
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్..
- భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!