దోహాలో భారీ పేలుళ్లు–దాడిని ఇజ్రాయెల్ ధృవీకరణ

- September 09, 2025 , by Maagulf
దోహాలో భారీ పేలుళ్లు–దాడిని ఇజ్రాయెల్ ధృవీకరణ

దోహా: ఇజ్రాయెల్ సైన్యం ఖతార్‌లో హమాస్ నేతలపై దాడి జరిపినట్టు ఇజ్రాయెల్ అధికారికంగా ధృవీకరించింది.ఈ విషయం పై ఐడీఎఫ్ (Israel Defense Forces) ఎక్స్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది.

ఐడీఎఫ్ తెలిపిన ప్రకారం – “హమాస్ తీవ్రవాద సంస్థ సీనియర్ నేతల పై ఐడీఎఫ్ మరియు ఐఎస్ఏ (ISA) సంయుక్తంగా ఖచ్చితమైన దాడి జరిపాయి. ఈ హమాస్ నాయకులు ఎన్నో సంవత్సరాలుగా సంస్థ కార్యకలాపాలను నడిపిస్తూ, అక్టోబర్ 7 న జరిగిన క్రూరమైన మారణహోమానికి నేరుగా బాధ్యులుగా ఉన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్‌పై జరుగుతున్న యుద్ధాన్ని కూడా వీరే ప్రణాళికలు రచించి నడిపిస్తున్నారు” అని పేర్కొంది.

పౌరులకు హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, అందులో భాగంగా అత్యంత ఖచ్చితమైన ఆయుధాలు, అదనపు గూఢచారి సమాచారం ఉపయోగించామని ఐడీఎఫ్ వెల్లడించింది.

“అక్టోబర్ 7 మారణహోమానికి బాధ్యులైన హమాస్ తీవ్రవాద సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు మా చర్యలు కఠినంగా కొనసాగుతాయి” అని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com