మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘SYG’ కీలక షెడ్యూల్ ప్రారంభం
- September 09, 2025
మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ సంబరాల ఏటిగట్టు (SYG) కీలకమైన షూటింగ్ షెడ్యూల్ లోకి ఎంటరైయింది.
రోహిత్ కెపి దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ₹125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇది సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది.
సెప్టెంబర్ మధ్యలో ప్రారంభమయ్యే అప్ కమింగ్ షెడ్యూల్‌లో పీటర్ హెయిన్ కొరియోగ్రఫీ చేసిన అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ సూపర్‌స్టార్‌తో సాయి దుర్గ తేజ్ తలపడతారు. గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే CGI వర్క్ కూడా వేగంగా జరుగుతోంది.
సాయి దుర్గ తేజ్ గత రెండు సంవత్సరాలుగా ‘ సంబరాల ఏటి గట్టు’ కోసం అంకితభావంతో పని చేస్తున్నారు. ఈ పాత్రకు అద్భుతంగా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు .
SYGని మొదట దసరా సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నా, ఇండస్ట్రీ సమ్మె కారణంగా రిలీజ్ వాయిదా పడింది. త్వరలోనే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు.
‘హనుమాన్’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో SYG ఒకటిగా నిలుస్తోంది.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ‘సంబరాల యేటి గట్టు’ పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవికృష్ణ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రోహిత్ KP,
నిర్మాతలు: K నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
DOP: వెట్రి పళనిసామి
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: నవీన్ విజయ కృష్ణ
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!