యూఏఈ పై భారత్ ఘన విజయం
- September 11, 2025
అబుధాబి: ఆసియా కప్ 2025లో భారత్ బోణీ కొట్టింది.తన తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. యూఏఈతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం నమోదు చేసింది. 9 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. 13.1 ఓవర్లలోనే 57 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 4.3 ఓవర్లలోనే చేజ్ చేసింది. 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 30 పరుగులు చేసి ఔటయ్యాడు.గిల్ 20 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులు చేశారు. మరో 93 బంతులు మిగిలి ఉండగానే..టార్గెట్ ని ఫినిష్ చేసేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ చెలరేగాడు.4 వికెట్లు తీసి ప్రత్యర్థి వెన్ను విరిచాడు. మరో ఎండ్ లో శివమ్ దూబె వణికించాడు.3 వికెట్లు తీసుకున్నాడు.బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు.
భారత్ తన నెక్ట్స్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో తలపడనుంది.ఈ మ్యాచ్ 14వ తేదీన జరగనుంది.
స్కోర్లు..
యూఏఈ–13.1 ఓవర్లలో 57 పరుగులకు ఆలౌట్
భారత్–4.3 ఓవర్లలో 60 పరుగులు
తాజా వార్తలు
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి







