దుల్కర్ సల్మాన్‌కు జోడీగా పూజా హెగ్డే
- September 11, 2025
బ్యూటీ బుట్టబొమ్మ పూజా హెగ్డే తెలుగులో కాస్త కాలంగా తెరపై కనిపించలేదు. కొన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమెకు ఇటీవల తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. తమిళ చిత్రాల్లో మాత్రం ఆమెకు మంచి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి, కానీ తెలుగులో చేతికి వచ్చే ప్రాజెక్ట్స్ కూడా వేరే కారణాల వల్ల వెనక్కి పోతున్నాయి. ఇలాంటి సమయంలో, ఓ క్రేజీ, పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే అవకాశం పొందారు.
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం SLV సినిమాస్ బ్యానర్లో రూపొందుతోంది. ఇది దుల్కర్ సల్మాన్ కెరీర్లో 41వ చిత్రం కావడం విశేషం. ప్రస్తుతానికి ఈ సినిమా వర్కింగ్ టైటిల్ #DQ41 అని పిలుస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ చాలా రోజుల క్రితమే సెట్స్‌పైకి వెళ్లి,సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటోంది.
చాలా రోజుల క్రితమే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా..సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఆమెకు వెల్కమ్ చెబుతూ ఓ స్పెషల్ వీడియోని పంచుకున్నారు.పూజా హెగ్డే షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలియజేస్తున్న ఈ మేకింగ్ వీడియో ఆకట్టుకుంటోంది.
ఇందులో హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు. పూజ స్కూటీ నడుపుతుండగా, దుల్కర్ ఆమె వెనుక కూర్చుని ఉన్నారు. ఈ సీన్ వారిద్దరి మధ్య మ్యాజికల్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తోంది. ఇద్దరూ తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. స్క్రీన్ పై జంట అందంగా కనిపించింది. బ్యాగ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ కూడా బాగుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ‘DQ 41’ షూటింగ్ జరుగుతున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.
దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రవి నేలకుడిటి దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అనయ్ ఓం గోస్వామి డీవోపీగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా రెడీ అవుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!