పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!

- September 11, 2025 , by Maagulf
పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!

మస్కట్: “క్లైమేట్ ల్యాండ్‌స్కేప్ అనాలిసిస్” అధ్యయనం కోసం టెక్నికల్ స్టీరింగ్ కమిటీ తన నివేదికను ఆమోదించింది. ఒమన్‌లోని యునిసెఫ్ కార్యాలయం సహకారంతో ఎన్విరాన్‌మెంట్ అథారిటీ తయారు చేసిన ఈ నివేదిక..  ఒమన్ సుల్తానేట్‌లోని పిల్లలు మరియు యువతపై వాతావరణ మార్పుల ప్రభావాలను అధ్యయనం చేశారు.

జాతీయ వ్యవస్థలను బలోపేతం చేయడానికి, భవిష్యత్తు ప్రమాదాల నుండి పిల్లలను రక్షించడానికి అనేక సిఫార్సులు ఈ నివేదికలో ఉన్నాయని తెలిపారు. అదే సమయంలో దీనిని అడ్డుకునేందుకు ఇది వివిధ రంగాల మధ్య సహకారం అవసరమని ప్రస్తావించారు. ముఖ్యంగా వైకల్యం ఉన్న పిల్లలు వంటి అత్యంత దుర్బల వర్గాలకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. 

ఏడు నెలల పాటు సాగిన ఈ నివేదిక తయారీలో ఐదు గవర్నరేట్‌లలోని వివిధ కమ్యూనిటీలు పాల్గొన్నాయని ఒమన్‌లోని యునిసెఫ్ ప్రతినిధి సుమైరా చౌదరి తెలిపారు. వాతావరణ మార్పులు పిల్లలపై ప్రభావం చూపుతుందని నివేదిక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని అన్నారు. భవిష్యత్ తరాలను సన్నద్ధం చేయడానికి ఒమన్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి యునిసెఫ్ సిద్ధంగా ఉందన్నారు. బ్రెజిల్‌లో జరిగే COP30 సమావేశంలో ఈ నివేదికను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com