ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!

- September 11, 2025 , by Maagulf
ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!

రియాద్: ఇరాన్,  అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) మధ్య సహకారం తిరిగి ప్రారంభమైంది. ఈ మేరకు కుదిరిన ఒప్పందాన్ని సౌదీ అరేబియా స్వాగతించింది. ఈ చర్య విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. దౌత్య పరమైన మార్గాల్లోనే శాంతిసాధ్యమవుతుందని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  

కైరోలో ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్ అబ్దేల్ అటీ సమక్షంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి -IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్సీలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com