ఫుడ్ ట్రక్కులపై బహ్రెయిన్ లో కొత్త నిబంధనలు..!!
- September 12, 2025
మనామా: ఫుడ్ ట్రక్కులపై బహ్రెయిన్ కొత్త నిబంధనలను రూపొందించింది. ఇకపై ఫుడ్ ట్రక్కులను బహ్రెయిన్ లు మాత్రమే నడపాలని నిర్దేశించారు. జంక్షన్ల నుండి 50 మీటర్ల దూరంలో నిర్వహించాలని, ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు మాత్రమే వ్యాపారం చేయాలని పార్లమెంట్ ముందున్న ముసాయిదా బిల్లులో నిర్దేశించారు. ఈ బిల్లును ఎంపీలు ఖలీద్ బువానాక్, అహ్మద్ అల్ సల్లూమ్ మరియు హిషామ్ అల్ అవధి ప్రతిపాదించారు.
దరఖాస్తుదారులు బహ్రెయిన్‌కు చెందినవారు అయి ఉండాలని, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ నుండి ఆమోదాలు పొందాలని నిబంధనల్లో చేర్చారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్‌లో ఫుడ్ ట్రక్కులను నమోదు చేసుకోవాలని, వాహనం పార్కింగ్ కోసం మున్సిపల్ క్లియరెన్స్ పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి వాహనం దాని వాణిజ్య పేరు, వాణిజ్య రిజిస్ట్రేషన్ నంబర్‌ను అందరికి కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







