UNHRCలో ఇజ్రాయెల్ పై సౌదీ అరేబియా ఫైర్..!!

- September 12, 2025 , by Maagulf
UNHRCలో  ఇజ్రాయెల్ పై సౌదీ అరేబియా ఫైర్..!!

జెనీవా: ఖతార్ పై ఇజ్రాయెల్ దురాక్రమణ ..దాని సార్వభౌమత్వాన్ని స్పష్టంగా ఉల్లంఘించడాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది . జెనీవాలో UN మానవ హక్కుల మండలిలో సౌదీ శాశ్వత ప్రతినిధి రాయబారి అబ్దుల్‌మోహ్సేన్ బిన్ ఖోథైలా ప్రసంగించారు. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మరియు అంతర్జాతీయ సంస్థలు ఖతార్‌ కు సంఘీభావాన్ని తెలియజేయాలని, ఆ దేశం తీసుకునే అన్ని చర్యలకు సౌదీ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ నేరపూరిత చర్యలు మరియు ఉల్లంఘనలు ఈ ప్రాంతంలో భయంకరమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని బిన్ ఖోథైలా హెచ్చరించారు. ఇవన్ని అంతర్జాతీయ చట్టం మరియు అంతర్జాతీయ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని అని అన్నారు. 

ఈ సందర్భంగా సిరియా భూభాగంలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడాన్ని, ఇటీవల హోమ్స్ మరియు లటాకియా గవర్నరేట్‌లలో అనేక ప్రాంతాలపై బాంబు దాడులను బిన్ ఖోథైలా ఖండించారు. ఇజ్రాయెల్ ఉల్లంఘనలను ఆపడానికి మరియు ఈ ప్రాంత భద్రతను దెబ్బతీసే నేరాలను ఖండించాలని కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com