వరసిద్ధునికి వైభవంగా అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం కాణిపాకం
- September 12, 2025
కాణిపాకం: దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం జరిగిన కల్పవృక్షవాహనసేవ సందర్భంగా ఉభయదారులచే స్వామివారికి అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకంను ఘనంగా నిర్వహించారు.ఈమేరకు ఉభయదారులైన దేవస్థానం కార్యనిర్వహణాధికారి, అర్చకులు మరియు ఆలయ సిబ్బంది స్వామివారికి అష్టోత్తర శత కలశ క్షీరాబిషేకంను నిర్వహించారు.
ఈమేరకు ఆలయ ఈఓ పెంచల కిషోర్, ఆలయ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు వందలాది మంది మంగళవాయిద్యాలు, కేరళవాయిద్యాలు, నవదుర్గ వేషధారణలు, విచిత్ర వేషాలు, తత్పెట గుళ్ళు వంటి ప్రత్యేక వైవిధ్యభరితమైన సాంస్కతిక ప్రదర్శనల నడుమ మణికంఠేశ్వరాలయం నుండి అష్టోత్తర శత కలశాలను గ్రామపురవీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయంలో అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకార మండపంలో వుంచి అష్టోత్తర శత కలశాలలోని పాలతో ఘనంగా అభిషేకించారు. అలాగే పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి చతుర్వేద పారాయణం గావించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు చేసి ధూపదీపనైవేద్యాలను సమర్పించారు. అనంతరం వేదపండితులు మంత్రపుష్పం గావించారు. ఈకార్యక్రమంలో ఈఓ పెంచల కిషోర్, డిప్యూటీ ఈఓ సాగర్బాబు, ఏఈఓ రవీంద్రబాబు, సూపరెండెంట్లు శ్రీధరాబాబు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజినాయుడు, చిట్టిబాబులతో పాటు ఆలయ, ఉత్సవ ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







