ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారికి సమన్లు జారీ చేసిన యూఏఈ..!!

- September 13, 2025 , by Maagulf
ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారికి సమన్లు జారీ చేసిన యూఏఈ..!!

యూఏఈ: ఎమిరేట్స్‌లోని ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారి డేవిడ్ అహద్ హోర్సాండీకి యుఏఈ సమన్లు జారీ చేసింది. ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు దూకుడు ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేసింది.
అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి రీమ్ బింట్ ఇబ్రహీం అల్ హషిమీ, ఇజ్రాయెల్ రాయబారిని పిలిపించారు. తాజా దాడి ఖతార్ సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ఇది అంతర్జాతీయ చట్టం మరియు UN చార్టర్‌పై కూడా దాడిగా అభివర్ణించారు. ఇజ్రాయెల్ దురాక్రమణ ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రత, స్థిరత్వాన్ని బెదిరించే బాధ్యతారహితమైన చర్యగా పేర్కొన్నారు.
ఖతార్ భద్రత మరియు స్థిరత్వం.. గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల భద్రత మరియు స్థిరత్వంలో అంతర్భాగమని అల్ హషిమి తేల్చిచెప్పారు. గల్ఫ్ దేశంపై జరిగే ఏదైనా దాడి సమిష్టి గల్ఫ్ భద్రతా వ్యవస్థపై దాడిగా పరిగణించబడుతుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్ దూకుడు మరియు రెచ్చగొట్టే విధానం శాంతిని సాధించే అవకాశాలను దెబ్బతీస్తుందని అన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com