భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- September 13, 2025
న్యూ ఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. దేశంలో అసలు టపాసులు తయారు చేయకుండా, కాల్చకుండా అమ్మకుండా ఉంటే బావుంటుందని అభిప్రాయపడింది. ఢిల్లీ తరహాలో దేశం మొత్తానికి స్వచ్ఛమైన గాలి అవసరమని అందుకోసం బ్యాన్ విధించాలనే ప్రతిపాదన చేసింది. ‘సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది కాబట్టి కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే స్వచ్ఛమైన గాలి ఉండాలని కాదు. అమృత్ సర్ లాంటి చోట కూడా క్లీన్ ఎయిర్ అవసరం.’ అని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు.
‘నేనీ మధ్య అమృత్ సర్ వెళ్లా. అక్కడ ఢిల్లీ కంటే ఎక్కువ కాలుస్యం ఉంది. ఢిల్లీలో ఉండే వాళ్లు గొప్పోళ్లు కాబట్టి అక్కడ క్లీన్ ఎయిర్ ఉండాలనేం కాదు. అన్ని రాష్ట్రాల వారికి స్వచ్ఛమైన గాలి అవసరం. కాబట్టి దేశం మొత్తం టపాసుల బ్యాన్ ఉండాలి.’ అని గవాయ్ అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో వాయుకాలుష్యం పెరిగిపోయింది. దీంతో టపాసులు కాల్చడం వల్ల కూడా ఆ వాయుకాలుష్యం పెరుగుతోందనే వాదనకు సుప్రీం ఏకీభవించింది. అప్పుడు దీపావళి సందర్భంగా కూడా టపాసులు కాల్చొద్దని ఆర్డర్స్ ఇచ్చింది. ఢిల్లీలో అసలు టపాసులు విక్రయాలను బ్యాన్ చేసింది. ఇప్పుడు దేశం మొత్తం టపాసులు బ్యాన్ చేయాలని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.
‘ఢిల్లీలో వాయిు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. అదిజనాల ప్రాణాలు తీస్తోంది. ముఖ్యంగా రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారులతో పాటు సాధారణ జనాలు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అలా అని ఢిల్లీలో ఉండే అందరూ డబ్బున్నోళ్లు కాదు. అందరూ ఎయిర్ ప్యూరిఫైయర్లు కొనుక్కోలేరు.’ అని గతంలో సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు.
తాజా వార్తలు
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!