అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!

- September 13, 2025 , by Maagulf
అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!

వాషింగ్టన్: ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థాని అమెరికాలో పర్యటిస్తున్నారు. వాషింగ్టన్‌లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ హెచ్‌ఇ జె.డి. వాన్స్ మరియు అమెరికా విదేశాంగ కార్యదర్శి హెచ్‌ఇ మార్కో రూబియోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖతార్-అమెరికా మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల బలోపేతంపై సమీక్షించారు.

ఇటీవల ఖతార్ పై ఇజ్రాయెట్ దాడిని పురస్కరించుకొని అమెరికా వైస్ ప్రెసిడెంట్ సంఘీభావాన్ని తెలియజేశారు. దౌత్యపరమైన చర్చల ద్వారానే మిడిలీస్ట్ లో అపరిష్కృత సమస్యలకు పరిష్కారం లభించగలవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

మిడిలీస్ట్ లో శాంతిని నెలకొల్పడంలో ఖతార్ అవిశ్రాంత మధ్యవర్తిత్వ ప్రయత్నాలను అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభినందించారు. ఖతార్ అమెరికాకు నమ్మకమైన వ్యూహాత్మక మిత్రదేశమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఖతార్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని ఖతార్ ప్రధానమంత్రి తేల్చిచెప్పారు. అమెరికాతో సన్నిహిత భాగస్వామ్యం,  ఖతార్ సార్వభౌమత్వానికి అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఖతార్ పీఎం కార్యాలయం ఒక ప్రకటన  విడుదల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com