కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!

- September 15, 2025 , by Maagulf
కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!

దోహా: కొత్త వాహనాలను ఎగుమతి చేయడంపై ఖతార్ ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. దాంతో దేశంలోని కార్ డీలర్‌షిప్‌లు కలిగి ఉన్న సంస్థలు కనీసం ఒక సంవత్సరం పాటు రిజిస్టర్ కాని కొత్త కార్లను ఎగుమతి చేయకూడదు. డీలర్లు ఈ నిబంధనను పూర్తిగా అమలు చేయాలని సూచించారు. ఉల్లంఘించే సంస్థకు భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు.  స్థానిక మార్కెట్లో కొత్త కార్ల అందుబాటును, అదే సమయంలో ధరలపై నియంత్రణను పెంచేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  అయితే, పర్సనల్ వినియోగ వాహనాలను మినహాయించినట్లు తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com