సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- September 15, 2025
రియాద్: సెహహతి అప్లికేషన్ ద్వారా సీజనల్ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్‌ను ఇప్పుడు అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవచ్చని సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఈ వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్ల తీవ్రతను సమర్థవంతంగా తగ్గిస్తుందన్నారు. దాంతో ఇంటెన్సివ్ కేర్ అవసరాన్ని తగ్గిస్తుందని డాక్టర్లు వెల్లడించారు. దాంతోపాటు సీజనల్ ఇన్ఫ్లుఎంజాతో సంబంధం ఉన్న మరణాల రేటును గణనీయంగా తగ్గిస్తుందన్నారు.
ఇక దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు, రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు తీసుకుంటున్నవారు, 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు, ఆరు నెలల నుండి ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఒబెసిటీ ఉన్న వ్యక్తులు మరియు హెల్త్ కేర్ వర్కర్స్ వంటి వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని మంత్రిత్వ శాఖ కోరింది.
గత సంవత్సరం డేటా ప్రకారం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చేరిన రోగులలో 96 శాతం మందికి ఇంకా వ్యాక్సిన్ అందలేదని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







