పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కిక్కెక్కిస్తున్న డైరెక్టర్ సుజిత్

- September 16, 2025 , by Maagulf
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కిక్కెక్కిస్తున్న డైరెక్టర్ సుజిత్

సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన సినిమా 'ఓ.జి'. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. రిలీజ్ కు కేవలం పది రోజులే ఉంది. చూస్తే అస్సలు ప్రమోషన్స్ చేయడం లేదు టీమ్. అయినా ప్రమోషన్స్ తో పనిలేకుండానే సినిమాపై భారీ అంటే భారీ అంచనాలున్నాయి. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ మూవీకి ఇంత హైప్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. మాగ్జిమం రీమేక్స్ ఎక్కువ చేయడం అందుకు ఓ కారణం. అయితే ఓ.జిపై మొదట్నుంచీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.ఆ మధ్య విడుదల చేసిన ఫైర్ స్ట్రామ్ సాంగ్ విని ఫ్యాన్స్ కు పూనకాలే వచ్చాయి. ఇక తాజాగా 'గన్స్ అండ్ రోజ్' అంటూ మరో పాటను విడుదల చేసింది టీమ్. పాట పూర్తిగా అర్థమయ్యేలా లేకున్నా.. పాటలోని గ్రాఫిక్ విజువల్స్ తోనే కిక్కెక్కించాడు.చూస్తే మాంటేజ్ సాంగ్ లా ఉంది.పవన్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే దర్శకుడు సుజిత్ చూపించబోతున్నాడు అనేలా ఉందీ సాంగ్. పాటలోని ఫైర్ కు ఫ్యాన్స్ థియేటర్స్ లో ఊగిపోవడం ఖాయం అనేలా ఉంది.మమూలుగా చాలా ప్రమోషన్స్ చేసినా రాని హైప్ వీరికి కేవలం పాటలతోనే వస్తుండటం విశేషం. పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ గా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ కనిపించబోతున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం సినిమాకే హైలెట్ గా నిలవబోతోందని ఈ పాటలతోనే అర్థం అవుతుంది. ఇక నేపథ్య సంగీతంతో ఎలాంటి మంటలు సృష్టిస్తాడో ఊహలకే వదిలేయాలేమో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com