జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- September 16, 2025
దోహా: గల్ఫ్ సహకార మండలి (జిసిసి) సభ్య దేశాల ప్రతినిధులతో అమీర్ హెచ్ హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ సమావేశం నిర్వహించారు. షెరాటన్ దోహా హోటల్లో అత్యవసర అరబ్-ఇస్లామిక్ సమ్మిట్ సందర్భంగా వీరు సమావేశం అయ్యారు.
ఇందులో ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్ ఎం షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్-థానీతో పాటు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిసిసి సెక్రటరీ జనరల్ హెచ్ ఎం జాసిమ్ మొహమ్మద్ అల్ బుదైవి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలను సమీక్షించారు. ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ ఒప్పందాలు, నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఖతార్ కు తమ మద్దతు కొనసాగుతుందని జీసీసీ దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!