టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- September 16, 2025
తిరుమల: టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ కు టిటిడి పాలక మండలి చైర్మన్ బీ.ఆర్.నాయుడు, పాలకమండలి సభ్యులు ఆధ్వర్యంలో సమావేశమైన శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమల అన్నమయ్య భవన్ లో మంగళవారం టిటిడి పాలక మండలి సమావేశం జరిగింది.
టిటిడి ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి బోర్డు సమావేశానికి హాజరైన ఈఓకు టిటిడి చైర్మన్, సభ్యులు స్వాగతించి, అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
గతంలో ఈఓగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ కు ఉన్న అనుభవం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో, టీటీడీని అభివృద్ధి దిశగా నడిపించడంలో ఉపయోగపడుతుందని పాలకమండలి సభ్యులు ఆకాంక్షించారు.
టీటీడీ ఈవోగా రెండవసారి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి సూచనలను తీసుకుని, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని ఈవో తెలిపారు.
అంతకుముందు టిటిడి చైర్మన్ మరియు బోర్డు సభ్యులు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను సన్మానించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..