ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!

- September 16, 2025 , by Maagulf
ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!

దోహా: అత్యవసర అరబ్-ఇస్లామిక్ సమ్మిట్ కోసం దోహాలో సమావేశమైన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల నాయకులు ఖతార్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణను ఏకగ్రీవంగా ఖండించారు. ఈ సందర్భంగా ఖతార్ సంఘీభావం, బలమైన ఐక్యతను తెలియజేశారు.   

ప్రాంతీయ ఐక్యతను చాటిచెప్పేలా GCC సుప్రీం కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. సభ్య దేశాల భద్రతను కాపాడటానికి దోహాలో అత్యవసరంగా సమావేశమవ్వాలని జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ మరియు హయ్యర్ మిలిటరీ కమిటీని ఆదేశించింది. ఈ మేరకు ఖతార్ ప్రధానమంత్రి సలహాదారు మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మజేద్ బిన్ మొహమ్మద్ అల్-అన్సారీ సమావేశ వివరాలను వెల్లడించారు. అరబ్-ఇస్లామిక్ సమ్మిట్.. గల్ఫ్, అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల ఐక్యతను ప్రతిబింబించే చారిత్రాత్మక సంఘటన అని అన్నారు.

పాలస్తీనా ప్రజలు తమ చట్టబద్ధమైన హక్కులన్నింటినీ పొందే వరకు పాలస్తీనా తమ ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటిగా ఉంటుందని GCC సెక్రటరీ జనరల్ హెచ్ ఇ జాసెం మొహమ్మద్ అల్ బుదైవి స్పష్టం చేశారు.  GCC దేశాల భద్రత విడదీయరానిదని, ఒక సభ్య దేశంపై జరిగే ఏదైనా దాడి అందరిపై దాడిగా పరిగణించబడుతుందని తేల్చిచెప్పారు. ఖతార్‌ భద్రత మరియు సార్వభౌమత్వాన్ని కాపాడటానికి అన్ని వనరులను సమీకరించడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com