AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- September 18, 2025
మనామా: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ముఖ్యమైన రంగాలలో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం పెంచేందుకు అవసరమైన చర్యలను బహ్రెయిన్‌లో భారత రాయబారి వినోద్ కె జాకబ్ స్వాగతించారు. బహ్రెయిన్ ఇండియా సొసైటీ, అల్మోయ్యద్ కంప్యూటర్స్ మిడిల్ ఈస్ట్ సహకారంతో బహ్రెయిన్‌లో సెప్టెంబర్ 14న నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫిబ్రవరి 2026లో న్యూఢిల్లీలో జరగనున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో బహ్రెయిన్ కు చెందిన ఐటీ, ఇతర కంపెనీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
ఇండియాను సందర్శించడానికి బహ్రెయిన్ జాతీయుల కోసం ఎలక్ట్రానిక్ వీసా వ్యవస్థను ప్రారంభించినట్టు గుర్తుచేశారు. బహ్రెయిన్ మాల్లో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌ను ప్రారంభమైందని, అలాగే కాన్సులర్ సేవలకు సంబంధించిన సేవా రుసుములపై 5 నుండి 6 శాతం తగ్గింపు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో CMF సహకారంతో ప్రాంతీయ భద్రతకు ఇండియన్ నావల్ షిప్ తార్కాష్ సహకారంతో ఇండియా-బహ్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాలలో ఇటీవలి పరిణామాలను రాయబారి జాకబ్ హైలైట్ చేశారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







