యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- September 18, 2025
దోహా: ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ వాహనదారులకు రోడ్ క్లోజర్ అలెర్ట్ జారీ చేసింది. యూనివర్సిటీ స్ట్రీట్‌లోని లెజ్బైలాట్ ఇంటర్చేంజ్ నుండి అబ్దుల్ అజీజ్ జాసిమ్ స్ట్రీట్ మీదుగా.. టెలివిజన్ ఇంటర్చేంజ్ వరకు రెండు లేన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, లెజ్బైలాట్ ఇంటర్చేంజ్ నుండి అల్ మార్ఖియా స్ట్రీట్ వరకు లెఫ్ట్ సైడ్ రోడ్ తెరిచి ఉంటుందని తెలిపింది. కాగా, టెలివిజన్ ఇంటర్చేంజ్ నుండి ఖలీఫా స్ట్రీట్ వరకు లెఫ్ట్ మాత్రం మూసిఉంటుందని పేర్కొంది.
ఈ రోడ్ క్లోజర్ ఆంక్షలు సెప్టెంబర్ 20వ తేదీని రాత్రి 11 గంటల నుండి సెప్టెంబర్ 25 ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది. యూనివర్సిటీ స్ట్రీట్ మరియు అబ్దుల్ అజీజ్ బిన్ జాసిమ్ స్ట్రీట్లను ఉపయోగించే వాహనదారులు లెజ్బైలాట్ మరియు టెలివిజన్ ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద రైట్ టర్న్ తీసుకొని సమీపంలోని ఇంటర్చేంజ్ మరియు స్ట్రీట్స్ గుండా వెళ్లాలని సూచించింది.
తాజా వార్తలు
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- UAEU Concludes Participation in the Arab Media Summit 2026
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







