డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!

- September 18, 2025 , by Maagulf
డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!

దుబాయ్: దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ మరియు ఫైనెస్ట్ సర్‌ప్రైజ్ డ్రాలో కేరళ వాసిని అధృష్టం వరించింది. 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు.  షార్జాలో నివసిస్తున్న 37 ఏళ్ల భారతీయ ప్రవాసి అబ్దుల్ రెహమాన్ కె, సెప్టెంబర్ 6న ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 4171తో మిలీనియం మిలియనీర్ సిరీస్ 516లో విజేతగా నిలిచాడు. అబ్దుల్ తన తొమ్మిది మంది స్నేహితులతో ప్రైజ్ మనీని పంచుకోనున్నాడు.  రిటైల్ కంపెనీకి సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అబ్దుల్ రెహమాన్ కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.  

ఇక గత 18 సంవత్సరాలుగా దుబాయ్ లో ఉంటున్న 47 ఏళ్ల ఆర్సెనియో ఎ, 1999లో ప్రారంభమైనప్పటి నుండి ఈ ప్రమోషన్‌లో $1 మిలియన్ గెలుచుకున్న 15వ ఫిలిప్పీన్స్ వ్యక్తిగా గుర్తింపు పొందాడు.   

వీరితోపాటు దుబాయ్‌లో నివసిస్తున్న 51 ఏళ్ల భారతీయ ప్రవాసి అమిత్ సరాఫ్ ఆగస్టు 26న ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 0482 అయిన మెర్సిడెస్-బెంజ్ G500 (అబ్సిడియన్ బ్లాక్) కారును గెలుచుకున్నాడు. అతను గతంలో వన్ మిలియన్ డాలర్ల విజేతగా కూడా నిలిచాడు. అలాగే, ఫిబ్రవరి 2023లో మెర్సిడెస్-బెంజ్ S500 కారు మరియు డిసెంబర్ 2023లో 40 వేల దిర్హాంల దుబాయ్ డ్యూటీ ఫ్రీ గిఫ్ట్ కార్డ్ గెలుచుకున్నాడు.  

ఉమ్ అల్ క్వైన్‌లో నివసించే 41 ఏళ్ల మరో భారత ప్రవాసి షఫీఖ్ నసరుద్దీన్, ఆగస్టు 28న దుబాయ్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 వద్ద కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 0347తో BMW F 900 GS అడ్వెంచర్ మోటార్‌బైక్‌ను గెలుచుకున్నాడు. అబుదాబిలో నివసిస్తున్న భారతీయ ప్రవాసి ఒలావో ఫెర్నాండెజ్ త్వరలో తన బ్రాండ్ న్యూ డుకాటి పానిగలే V2 (రెడ్) మోటార్‌బైక్‌తో రోడ్డుపైకి రానున్నారు  అతను ఆగస్టు 27న ఆన్‌లైన్‌లో ఎంచుకున్న టికెట్ నంబర్ 0239తో విజేతగా నిలిచాడు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com