రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- September 18, 2025
యూఏఈ: రాస్ అల్ ఖైమాలోని వాడి ఎస్ఫిటాలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలుడులో ఒక డొమెస్టిక్ వర్కర్ తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు దాటికి ఇళ్లు దెబ్బతిన్నది. కాగా, గ్యాస్ పేలుడు సమయంలో ఇంట్లో వారు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని పోలీసులు తెలిపారు. కాగా, గ్యాస్ పైప్ ను ఎలుక కొరకడంతో గ్యాస్ లీక్ అయి ప్రమాదం జరిగిందని ప్రథామికంగా అధికారులు నిర్ధారించారు.
ఇక తీవ్రంగా గాయపడ్డ 40 ఏళ్ల డొమెస్టిక్ వర్కర్ కు ఐసీలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉంది, దాదాపు 20 శస్త్రచికిత్సలు అవసరమని డాక్టర్లు తెలిపారు. ఆమెకు మొదట ఫుజైరా ఆసుపత్రిలో చికిత్స అందించగా, తర్వాత ఆమె గాయాల తీవ్రత కారణంగా షేక్ ఖలీఫా స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







