GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- September 19, 2025
దోహా: దోహాలో GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ఖతార్ ఉప ప్రధాన మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థాని అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ఒమన్ సుల్తానేట్ రక్షణ మంత్రిత్వ శాఖ సెక్రటరీ జనరల్ డాక్టర్ మొహమ్మద్ బిన్ నాసర్ అల్ జాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి మొహమ్మద్ బిన్ ముబారక్ అల్ మజ్రౌయి, బహ్రెయిన్ రక్షణ వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా హసన్ అల్ నుయిమి, సౌదీ అరేబియా రక్షణ డిప్యూటీ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ రెహమాన్ బిన్ మొహమ్మద్, కువైట్ రక్షణ మంత్రి షేక్ అబ్దుల్లా అలీ అల్ అబ్దుల్లా అల్ సబా మరియు జిసిసి సెక్రటరీ జనరల్ జాసెం మొహమ్మద్ అల్బుదైవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించారు. ఖతార్ సార్వభౌమత్వం మరియు ప్రాదేశిక సమగ్రతను స్పష్టంగా ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రమాదకరమైన సైనిక దాడిని జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ చట్టాల ప్రధాన సూత్రాలు మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ ను ఉల్లంఘించిందన్నారు. ఖతార్ పై జరిగిన దాడి అన్ని జిసిసి దేశాలపై దాడి అని కౌన్సిల్ ధృవీకరించింది. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ దురాక్రమణను ఎదుర్కోవడానికి ఐక్యంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
అలాగే, గాజా స్ట్రిప్లో కాల్పుల విరమణను సాధించడానికి మరియు బందీలు, నిర్బంధితులను విడుదల చేయడానికి ఖతార్ చేపట్టిన దౌత్య, మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ఉల్లంఘించడమేనని కౌన్సిల్ అభిప్రాయపడింది.
ఉమ్మడి రక్షణ మండలి యూనిఫైడ్ సైనిక కమాండ్ ద్వారా నిఘా సమాచార మార్పిడిని పెంచుతుందన్నారు. బాలిస్టిక్ క్షిపణులకు వ్యతిరేకంగా ముందస్తు హెచ్చరిక వ్యవస్థ కోసం గల్ఫ్ జాయింట్ టాస్క్ ఫోర్స్ పనిని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. రాబోయే మూడు నెలల్లో ఉమ్మడిగా సైనిక విన్యాసాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్ లో ఈ తరహా దాడులను ఎదుర్కోవడానికి రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంతోపాటు సైనిక మరియు నిఘా స్థాయిలలో సమన్వయాన్ని కొనసాగించాలని కౌన్సిల్ నిర్ణయించిందని ఒక ప్రకటనలో తెలియజేశారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!