నటుడు రోబో శంకర్ మృతి..
- September 19, 2025
చెన్నై: కోలీవుడ్ చిత్రసీమ లో ఒక పెద్ద విషాదం నెలకొంది. తన వినూత్న హాస్యప్రదర్శనలతో, ప్రత్యేక శైలితో ప్రేక్షకుల మనసులను దోచుకున్న ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ఇకలేరు. 46 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూసిన వార్త తమిళ సినీప్రపంచానికే కాకుండా, దక్షిణాది ప్రేక్షకులను తీవ్రంగా కలిచివేసింది.
రోబో శంకర్ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ వార్త బయటకు రాగానే ఆయన అభిమానులు, సినీప్రజలు, సహచరులు అందరూ తీవ్ర షాక్‌కు గురయ్యారు.
సినిమా రంగంలోకి వచ్చిన రోబో శంకర్ తన ప్రత్యేకమైన హావభావాలు, శరీరభాష, టైమింగ్ సెన్స్‌తో కొద్దికాలంలోనే సూపర్‌హిట్ హాస్యనటుడిగా గుర్తింపు పొందారు. టెలివిజన్ కార్యక్రమాల ద్వారా తన ప్రతిభను చూపించుకున్న ఆయన, తరువాత సినిమాలలోనూ మంచి పాత్రలతో ముందుకు వచ్చారు.
కామెడీ కి కొత్త రూపం ఇచ్చిన ఈ నటుడు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, తన పాత్రలకు సజీవతను కూడా తీసుకువచ్చారు.రోబో శంకర్ కమల్ హాసన్ కి వీరాభిమాని. అయితే తన అభిమాని చనిపోయాడన్న వార్త తెలుసుకున్న నటుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా అతడికి నివాళులు అర్పించాడు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







