బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!

- September 19, 2025 , by Maagulf
బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!

మానామా: బహ్రెయిన్, ఇండియా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త శకం ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక లీగల్ మరియు ట్యాక్స్ చట్టాల బలోపేతానికి కృషి చేయాలని నిర్ణయించారు. బహ్రెయిన్ అంతర్జాతీయ వివాద పరిష్కార మండలి సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ మారికే పట్రాని పాల్సన్..  భారత న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పెట్టుబడులు, చట్టపరమైన సహకారం మరియు ఆధునిక అంతర్జాతీయ వివాద పరిష్కార విధానాల అభివృద్ధిలో సహకారాన్ని పెంపొందించడంపై చర్చలు జరిపారు. సరిహద్దు పెట్టుబడులను ప్రోత్సహించడానికి, చట్టపరమైన సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి, అదే సమయంలో  ఆర్థిక వృద్ధికి దోహదపడే ప్రభావవంతమైన వివాద పరిష్కార మార్గాల అమలు చేయడానికి రెండు వైపులా వ్యూహాలను పెంపొందించుకోవాలని నిర్ణయించారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అంజు రతి రాణా, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్, భారతదేశంలోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం ప్రతినిధి మహదీ జాఫర్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com