కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!

- September 19, 2025 , by Maagulf
కువైట్ లో \

కువైట్: కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" పేరిట నేషనల్  క్లీనింగ్ క్యాంపెయిన్ ను నిర్వహించానున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో నవంబర్ 4 నుండి డిసెంబర్ 5 వరకు అన్ని గవర్నరేట్‌లలో జాతీయ పరిశుభ్రతా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ డాక్టర్ అమ్తాల్ అల్-హువైలా వెల్లడించారు.

జాతీయ పరిశుభ్రతా ప్రచారం సందర్భంగా పర్యావరణ అవగాహనను ప్రోత్సహించడం, స్వచ్ఛంద సేవను ప్రోత్సహించడం మరియు పరిశుభ్రతను రోజువారీ జీవనశైలిగా పొందుపరచడం లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది.  విద్యా మంత్రిత్వ శాఖ మరియు కువైట్ మునిసిపాలిటీతో సహా కీలక ప్రభుత్వ సంస్థలు, గవర్నరేట్లు, పౌర సమాజ సంస్థలు మరియు యువ స్వచ్ఛంద సేవా బృందాలు ఈ ప్రచారంలో పాల్గొంటాయని తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com