దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- September 20, 2025
దుబాయ్: దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు కు సంబంధించి దుబాయ్‌లోని క్రిమినల్ మిస్‌డిమీనర్ కోర్టు ఒక ఆసియా వ్యక్తికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది.అతని అరబ్ సహచరుడి ద్వారా నకిలీ హోటల్ లీజు ఒప్పందం ద్వారా అరబ్ పెట్టుబడిదారుడిని 2 లక్షల 10వేల దిర్హామ్‌లు మోసం చేసినట్టు కోర్టు నిర్ధారించింది. ఇద్దరూ కలిసి 2 లక్షల 10వేల దిర్హామ్‌లు జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. శిక్ష అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని తీర్పు చెప్పింది. కేసు రికార్డుల ప్రకారం, హోటల్ మేనేజర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా నటిస్తూ నిందితులు తనను మోసం చేశారని పేర్కొంటూ పెట్టుబడిదారుడు ఫిర్యాదు చేశాడు.
దుబాయ్‌లోని ఒక హోటల్లో మొత్తం అంతస్తును 3 లక్షల 80 వేల దిర్హామ్‌లు అద్దెకు తీసుకోవాలని బాధితుడిని ఒప్పించారు. 2 లక్షల 10వేల దిర్హామ్‌లు అడ్వాన్సుగా తీసుకున్నారు. మిగిలిన మొత్తానికి పోస్ట్ డేట్ డ్ చెక్కు తీసుకున్నారు. 10 నుండి 20 రోజుల్లో ఫ్లోర్ ను అందిస్తామని హామీ ఇచ్చారు.
కాగా, మూడు రోజుల తర్వాత వారు హోటల్ యాజమాన్యానికి ఒప్పందాన్ని ఇవ్వగా, అది నకిలీదని తేలింది. బాధితుడి నమ్మకాన్ని పొందడానికి నిందితుడు హోటల్ పెట్టుబడిదారులలో ఒకరితో కుటుంబ సంబంధాలను ఉపయోగించుకున్నాడని పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...