'తొలికిరణం' చిత్రం

- July 20, 2016 , by Maagulf
'తొలికిరణం' చిత్రం

పి.డి.రాజు ఏసుక్రీస్తుగా జె.జానబాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'తొలికిరణం'. అభినయ మేరీమాతగా నటించగా భానుచందర్‌, సాయికిరణ్‌, సురేఖావాణి కీలక పాత్రలు పోషించారు. టి. సుధాకర్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తైంది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ''ఏసుక్రీస్తూ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటి వరకు వచ్చిన క్రీస్తూ చిత్రాల్లో లేని కొత్త అంశాల్ని ఇందులో చూపిస్తున్నాం. ఆయన సమాధి అయ్యి తిరిగొచ్చిన తర్వాత మానవాళికి ఎటువంటి సందేశాలిచ్చారు అన్నది ఈ చిత్రంలో కీలకం. ఇజ్రాయిల్‌, జెరుసలెం వంటి ప్రాంతాల్లో క్రీస్తూకి సంబంధించిన ఆధారాలను సేకరించి చిత్రాన్ని తెరకెక్కించాను. చాలా ఏళ్ల తర్వాత ఎస్‌.పి.బాలుగారు క్రీస్తు సినిమాకి ఓ పాట పాడారు. చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందని ఆయన చెప్పడం ఆనందం కలిగించింది. ఆగస్ట్‌ 28న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో పాటల్ని విడుదల చేసి, క్రిస్మ్‌సకి సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం'' అని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com