గోపీచంద్ ఆధ్వర్యంలో మరో బ్యాడ్మింటన్ అకాడమీ
- July 20, 2016
జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో మరో బ్యాడ్మింటన్ అకాడమీ త్వరలో ప్రారంభంకానుంది. ఉత్తర భారత్‌లో తొలిసారి ప్రపంచస్థాయి వసతులతో గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. గోపీచంద్, గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలెప్‌మెంట్ అథారిటీ(జీఎన్‌ఐడీఏ), స్పోర్ట్స్‌లైవ్‌లు సంయుక్తంగా ప్రారంభించనున్న అకాడమీ ఒప్పందంపై బుధవారం సంతకాలు చేశారు. హైదరాబాద్, గ్వాలియర్, వడోదర నగరాల్లో గోపీచంద్‌కు ఇప్పటికే అకాడమీలు ఉన్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న భారత్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కశ్యప్, కిదాంబి శ్రీకాంత్‌లు హైదరాబాద్ కేంద్రంగా 2001లో ఆరంభమైన 'గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ'లో శిక్షణ పొందిన వారు కావడం విశేషం.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







