కువైట్‌లో అంతర్జాతీయ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్‌ బస్ట్..!!

- September 20, 2025 , by Maagulf
కువైట్‌లో అంతర్జాతీయ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్‌ బస్ట్..!!

కువైట్: కువైట్ లోని హవల్లి గవర్నరేట్ లో అంతర్జాతీయ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్‌, మనీ లాండరింగ్ కు పాల్పడుతున్న ముఠాను క్రిమినల్ సెక్యూరిటీ విభాగాలు అడ్డుకున్నాయని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  సోషల్ మీడియా అప్లికేషన్‌ల ద్వారా నెట్‌వర్క్ కార్యకలాపాలపై అందిన సమాచారం ఆధారంగా నెట్ వర్క్ ను బస్ట్ చేసినట్లు తెలిపింది. ఈ అక్రమ కార్యకలాపాలకు సంబంధం ఉన్న ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. అరెస్టయిన వారిలో ఆరుగురు ఈజిప్షియన్లు, ఒక సిరియన్ ఉన్నారు.

జనరల్ ట్రేడింగ్ సంస్థలు, డెలివరీ కంపెనీలు, హెల్త్ సెలూన్లు మరియు క్లాత్, పెర్ఫ్యూమ్ దుకాణాలతో సహా అనేక వాణిజ్య రంగాలను నెట్ వర్క్ సభ్యులు ఉపయోగించుకున్నారని దర్యాప్తులో వెల్లడైందని వెల్లడించింది. టర్కీలో నివసిస్తున్న మధ్యవర్తి ద్వారా విదేశాల నుండి నిధులను మనీలాండరింగ్ చేస్తున్నారని,  ప్రతిసారీ 25వేల కువైట్ దినార్ల వరకు ట్రాన్స్ ఫర్ చేసేవారని వెల్లడించారు. ఆ తర్వాత నిధులను అనధికారిక మార్గాల ద్వారా దేశంలోకి తిరిగి తీసుకొచ్చి, సభ్యులకు పంపిణీ చేసేవారని అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ నెట్ వర్క్ కు చెందిన 1 లక్ష 53 వేల 837 కువైట్ దినార్లను స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ పేర్కొన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com