సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- September 21, 2025
రియాద్: సౌదీ అరేబియా భద్రతా అధికారులు సెప్టెంబర్ 11 మరియు సెప్టెంబర్ 17 మధ్య మొత్తం 21,638 మంది అక్రమ నివాసితులను అరెస్టు చేశారు. అరెస్టు చేయబడిన వారిలో 12,958 మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించినవారు, 4,540 మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించినవారు మరియు 4,140 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినవారు ఉన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
సౌదీలోకి రావడానికి ప్రయత్నిస్తున్న 1,391 మందిని అరెస్టు చేయగా, వీరిలో 54 శాతం యెమెన్ జాతీయులు, 45 శాతం ఇథియోపియన్ జాతీయులు మరియు ఒక శాతం ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు. అక్రమ నివాసితులకు సాయం చేస్తున్న 19మందిని కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
అక్రమ నివాసితులకు ఎవరైనా సాయం అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 15 సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు 1 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. వీటితోపాటు నిందితులుగా తేలిన వ్యక్తల వాహనాలు, ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 నంబర్‌కు, మిగిలిన ప్రాంతాలలో 999 మరియు 996 నంబర్లకు కాల్ చేయడం ద్వారా సమాచారాన్ని అందించాలని కోరారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







