ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- September 21, 2025
మనామా: బహ్రెయిన్ ఆటం సీజన్ లోకి ప్రవేశిస్తుంది. ఈ సంవత్సరం మొదటిసారిగా 40°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. తేమ 70% మించకుండా ఉంటుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 27°Cకి తగ్గుతాయని వాతావరణ డైరెక్టరేట్ పేర్కొంది. సెప్టెంబర్ 25వరకు వాయువ్య గాలులు చురుకుగా ఉంటాయని తెలిపింది.
గత వారం రోజులుగా బహ్రెయిన్‌లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయని వెల్లడించింది. ముఖ్యంగా సముద్రంలోనికి వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని, అధికారిక వాతావరణ హెచ్చరికలను ఫాలో కావాలని నివాసితులకు డైరెక్టరేట్ సూచించింది. అక్టోబర్ నెల చివరి నాటికి రాత్రిసమయాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని, నవంబర్ చివరి వరకు పగటిపూట చల్లదనం కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు, పిల్లలు మరియు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారికి కాలానుగుణ అనారోగ్యాల వ్యాప్తి అధికంగా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







