ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!

- September 23, 2025 , by Maagulf
ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!

దోహా: పెట్టుబడి అవకాశాలను, సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా భారతీయ ప్రైవేట్ రంగాల మధ్య సహకారం మరియు భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చించారు. అదే సమయంలో రెండు దేశాలలో పెట్టుబడిదారులకు ఆశాజనకమైన పెట్టుబడి రంగాలపై సమీక్షించారు. ఖతార్ ఛాంబర్ బోర్డు సభ్యుడు మొహమ్మద్ బిన్ మహదీ అల్ అహ్బాబి ఖతార్ తరఫున, PHDCCI భారతదేశంలోని అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ సహ-ఛైర్మన్ సంజయ్ బెస్వాల్ భారత తరఫున చర్చల్లో పాల్గొన్నారు.

ఖతార్ మరియు భారతదేశం మధ్య అన్ని స్థాయిలలో.. ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక సంబంధాలలో బలమైన సహకారాన్ని మొహమ్మద్ బిన్ మహదీ అల్ అహ్బాబి హైలైట్ చేశారు. భారతదేశం- ఖతార్ అతి ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములలో ఒకటి అని, 2024 లో ద్వైపాక్షిక వాణిజ్యం 48 బిలియన్ ఖతార్ రియాల్స్ కు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. ఖతార్ మార్కెట్లో వివిధ రంగాలలో పనిచేస్తున్న అనేక భారతీయ కంపెనీల ఉనికి ద్వారా ఖతార్ ఆర్థిక అభివృద్ధికి మద్దతు ఇవ్వడంలో భారత వ్యాపార సంఘం చురుకైన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

ఆయిల్, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ మరియు ఆహార భద్రతతో సహా విభిన్న రంగాలలో ఉమ్మడి పెట్టుబడులు మరియు ప్రాజెక్టుల ద్వారా ఖతార్-భారతీయ కంపెనీల మధ్య భాగస్వామ్యాలు, సహకారాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు.ఈ సందర్భంగా ఖతార్‌లో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలను అన్వేషించమని అల్ అహ్బాబి భారతీయ కంపెనీలను ఆహ్వానించారు.ఈ సమావేశంలో ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయంలోని కమర్షియల్ అటాచ్ దీపక్ పుండిర్ కూడా పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com