షార్జా రాజ కుటుంబంలో విషాదం

- September 23, 2025 , by Maagulf
షార్జా రాజ కుటుంబంలో విషాదం

షార్జా: షార్జా పాలకుడు, సుప్రీంకౌన్సిల్ సభ్యుడు షేఖ్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమీ కార్యాలయం, షార్జా రాజ కుటుంబానికి చెందిన షేఖ్ సుల్తాన్ బిన్ ఖలీద్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమీ మరణాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించింది.

మంగళవారం (సెప్టెంబర్ 23) ఉదయం 10 గంటలకు కింగ్ ఫైసల్ మసీదులో జనాజా నమాజ్ జరగనుంది. అనంతరం ఆయనను అల్ జబీల్ స్మశానంలో ఖననం చేయనున్నారు.

అంతేకాక, సంతాప సభలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. పురుషుల కోసం సంతాప స్వీకరణను షార్జాలోని అల్ రుమైల ప్రాంతంలో ఉన్న షేఖ్ ఫైసల్ బిన్ ఖలీద్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమీ మజ్లిస్లో రేపటి నుండి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.

మరణవార్తతో షార్జా అంతటా దుఃఖ వాతావరణం నెలకొంది.ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు దుఃఖచర్యను పాటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.మంగళవారం నుండి ప్రారంభమయ్యేలా అధికారికంగా మూడు రోజుల దుఃఖచర్య ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com