BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- September 23, 2025
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC) లో పాల్గొనే వారికి మెడికల్ సఫోర్ట్ అందనుంది. ఈ మేరకు సర్క్యూట్ ట్రాక్ ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్ ప్రొవైడర్‌గా ప్రభుత్వ ఆసుపత్రుల ‘ప్రైవేట్ ప్రాక్టీస్ సర్వీసెస్’తో ఒప్పందం చేసుకుంది. సఖిర్‌లోని BIC ప్రాంగణంలో జరిగిన సంతకాల కార్యక్రమంలో BIC చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ సల్మాన్ బిన్ ఇసా అల్ ఖలీఫా మరియు ప్రభుత్వ ఆసుపత్రుల CEO డాక్టర్ మరియం అద్బీ అల్ జలాహ్మా పాల్గొన్నారు.
ఈ ఒప్పందం ప్రకారం సర్క్యూట్లో జరిగే అంతర్జాతీయ మరియు స్థానిక ట్రాక్ ఈవెంట్లలో అవసరమైన వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రులు అందిస్తాయి. సర్క్యూట్లో అన్ని రేసింగ్ ఈవెంట్ల సమయంలో పాల్గొనే వారందరి భద్రత అత్యంత ముఖ్యమైనదని, ఈ విషయంలో ప్రభుత్వ ఆసుపత్రులు అవసరమైన వైద్య సేవలు అందిస్తాయని BIC చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. మోటార్‌స్పోర్ట్ ఈవెంట్లలో పాల్గొనే వారందరికీ ఉత్తమ వైద్య సహాయం అందించడానికి తమ సిబ్బంది పనిచేస్తారని ప్రభుత్వ ఆసుపత్రుల CEO అన్నారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







