చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- September 23, 2025
మస్కట్: చరిత్రలో తొలిసారిగా ఒమానీ రియాల్‌తో పోలిస్తే భారత రూపాయి రూ.230 దాటింది. US డాలర్‌తో పోలిస్తే ఇంట్రాడేలో భారత రూపాయి 31 పైసల తగ్గడం ఈ పతనానికి కారణమైంని నిపుణులు తెలిపారు. US డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 88.72 కు చేరి ఆల్-టైమ్ కనిష్ట స్థాయిని తాకిందని మస్కట్‌లో నివసిస్తున్న ఆర్థిక నిపుణుడు ఆర్. మధుసూదనన్ పేర్కొన్నారు. అమెరికా H-1B వీసా రుసుము పెంపు ప్రకటనే కారణమని అన్నారు.
ఇండియాకు ఇన్వర్డ్ రెమిటెన్స్‌కు ప్రధాన వాటిలో ఒకటైన ఐటీ పరిశ్రమ అమెరికా ప్రకటనతో భయాందోళనలకు గురైందని అన్నారు. దాంతో ఐటీ ఇండెక్స్ 1% కంటే ఎక్కువ తగ్గుదల నమోదైందని, భారత స్టాక్ ఎక్స్ఛేంజ్లోని పదహారు ప్రధాన రంగాలలో పదమూడు నష్టాల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు.
రష్యన్ ముడి చమురు కొనుగోలు కారణంగా భారతీయ వస్తువులపై ఇప్పటికే ప్రకటించిన అధిక టారిఫ్ సుంకాల కారణంగా భారత రూపాయి బలహీన పడింది. ఇప్పుడు వీసా రుసుములపై తాజా ప్రకటన మార్కెట్‌ను మరింత దెబ్బతీసిందని అని మధుసూదనన్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …