టమాటతో హల్వా
- July 20, 2016
కావలసినవి పదార్ధాలు : ఎర్రని టమాటాలు : ఆరు , నెయ్యి : అరకప్పు , పంచదార : కప్పు , రవ్వ : అర కప్పు , బాదం, జీడిపప్పులు : అర కప్పు , యాలకులు పొడి : టీ స్పూన్
తయారుచేయు విధానం :
ముందుగా టమాటాలు ఉ డకబెట్టి నీళ్ళు వంపి, మిక్సిలో గుజ్జుగా చేసి పక్కన పెట్టాలి. స్టవ్ వెలిగించి నెయ్యి వేడిచేసి జీడిపప్పులు, బాదం పప్పులు దోరగా వేపి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యి లో రవ్వ వేసి దోరగా వేపి, దానిలో రెండు కప్పుల నీళ్ళు పోసి వుడకనివ్వాలి. రవ్వకాస్త గట్టిపడగానే టమాట గుజ్జు, పంచదార వేసి కలపాలి, బాగా చిక్కబడిన తరువాత యాలుకల పొడి, వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, మిగిలిన నెయ్యి వేసి కలిపి ముద్దగా అయ్యిన తరువాత స్టవ్ ఆపాలి. ప్లేటుకి నెయ్యిరాసి ఈ మిశ్రమం వేసి సమంగా చేసి ముక్కలు కట్ చేసుకోవాలి. లేదా ఒక గాజు గిన్నెలోకి ఈ హల్వని తీసుకోని స్పూన్ తో తినవచ్చు.
* అంతే టమాట హల్వ రెడీ.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







