భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాకు ఘనంగా వీడ్కోలు..!!
- September 25, 2025
కువైట్: కువైట్‌లో భారత రాయబారిగా ఉన్న డాక్టర్ ఆదర్శ్ స్వైకాకు ఘనంగా వీడ్కోలు పలికారు. తన మూడేళ్ల పదవీకాలంలో భారత్-కువైట్ భాగస్వామ్యం , భారతీయ ప్రవాస కమ్యూనిటీపై ఆయన బలమైన ముద్ర వేశారు. తన పదవీ కాలంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేశారు. కువైట్‌లోని భారతీయ పౌరులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే సంస్కరణలను ప్రవేశపెట్టారు.
ఆదర్శ్ స్కైకా కాలంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 43ఏళ్ల తర్వాత కువైట్ లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా హిస్ హైనెస్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా మోడీకి కువైట్ అత్యున్నత పౌర గౌరవం అయిన ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్-కబీర్‌ను ప్రదానం చేశారు. ఇది భారత్-కువైట్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెంచడంలో నూతన అధ్యాయాన్ని నెలకొల్పింది. ఆయన త్వరలోనే కెన్యా రిపబ్లిక్కు భారత హైకమిషనర్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







