విజిటర్స్ ఎంట్రీ పర్మిట్ కోసం పాస్‌పోర్ట్ కవర్ కాపీని సమర్పించాలా?
- September 25, 2025
యూఏఈ: యూఏఈలో ఎంట్రీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇప్పుడు వారి పాస్‌పోర్ట్ కవర్ పేజీని సమర్పించాల్సి ఉంటుందని అమెర్ సెంటర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించి ట్రావెల్ ఏజెన్సీల నుండి తమకు నోటిఫికేషన్లు వచ్చాయని, ఇప్పుడు తమ దరఖాస్తుతో పాటు పాస్ పోర్ట్ కవర్ పేజీని అప్‌లోడ్ చేస్తున్నట్లు పలువురు విజిటర్స్ తమ సోషల్ మీడియాలో పోస్టుల్లో వెల్లడించారు.
యూఏఈలో తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఇక నుండి విజిటర్స్ ఎంట్రీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ పాస్‌పోర్ట్ కాపీ, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, హోటల్ బుకింగ్ నిర్ధారణ, రౌండ్ ట్రిప్ టికెట్ కాపీ మరియు పాస్‌పోర్ట్ కవర్ పేజీని సమర్పించాల్సి ఉంటుందని కొందరు ట్రావెల్ ఏజెంట్లు స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని మరికొందరు ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు.
కాగా, ఈ విషయంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ & ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) మరియు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ (ICP) అధికారికంగా స్పందించాల్సి ఉందని ట్రావెల్ ఇండస్ట్రీకి చెందిన నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







